
హైదరాబాద్: ఈదులు, తాళ్లు ఎక్కి కల్లు గీసేందుకు గౌడన్నలకు కాటమయ్య సేఫ్టీ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఈ క్రమంలో సేఫ్టీ కిట్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఈ నెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 100 సేఫ్టీ కిట్ల చొప్పున మొదటి విడుతలో మొత్తంగా 10 వేల కిట్లను అందించనున్నట్లుగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాటమయ్య సేఫ్టీ కిట్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించిన్నట్లుగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో కల్లు వృత్తిపై ఆధారపడ్డ ప్రతి గౌడన్నకు సేఫ్టీ కిట్టును అందిస్తామన్నారు.