- నేడు మీడియా ద్వారా అభ్యర్థుల సందేహాలకు సమాధానం!
హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 అభ్యర్థుల సందేహాలను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది. శనివారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కలిసి పలువురు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు.
జీవో 29, జీవో 55లపై చర్చించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ వల్ల ఏ ఒక్క అభ్యర్థి నష్ట పోకుండా తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేశారు. ఆదివారం మంత్రులు పొన్నం, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో అభ్యర్థుల సందేహాలను తీర్చనున్నట్లు తెలుస్తోంది.