ధర్నాలు, ఆందోళనలపై ప్రతిరోజూ రిపోర్టు ఇవ్వండి!

ధర్నాలు, ఆందోళనలపై ప్రతిరోజూ రిపోర్టు ఇవ్వండి!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న ధర్నాలు, ఆందోళనలు, నిరసర కార్యక్రమాలకు సంబంధించి ప్రతిరోజూ పూర్తి స్థాయిలో రిపోర్టు ఇవ్వాలని అటు ఇంటెలిజెన్స్​కు, ఇటు డిపార్ట్​మెంట్లకు సర్కార్ నుంచి ఇంటర్నల్ ఆదేశాలు వెళ్లాయి. ఆ ధర్నాల వెనక పొలిటికల్ అజెండా ఏమైనా ఉందా? ఏ లీడర్లు పాల్గొన్నారు? సమస్య ఏంటి? అనే వివరాలను పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లు తెలిసింది.  మొన్నటి దాకా రాష్ట్ర, జిల్లా స్థాయిలో జరిగే ముఖ్యమైన ధర్నాలు, పెద్ద స్థాయి లీడర్లు పాల్గొనే ఆందోళనలపై మాత్రమే ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇచ్చేది. ఇప్పడది మండల స్థాయి దాకా వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఏదైనా మండలంలో చిన్న పొలిటికల్ మీటింగ్, నిరసన, ఆందోళన జరిగినా.. వాటి వివరాలను ఇంటెలిజెన్స్ ఇవ్వాలని, ఒకవేళ డిపార్ట్​మెంట్లకు సంబంధించిన సమస్యలైతే ఆయా డిపార్ట్ మెంట్లు జీఏడీకి రిపోర్టు పంపాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా, మూడ్రోజుల కిందట మండల స్థాయి నుంచి డేటా తెప్పించగా... ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ మీటింగ్స్, ఆందోళనలు, నిరసనలన్నీ కలిపి 180 జరిగినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఏయే విషయాలపై మండల స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే దానిపై ప్రతిరోజూ సీఎంఓకు రిపోర్టు వెళ్తున్నది. అందులో ఉన్న అంశాల ప్రకారం పొలిటికల్ మీటింగ్​ అయితే ఎంతమంది వస్తున్నారు? అపోజిషన్ పార్టీ వాళ్లా? ఏ లీడర్ మండల, జిల్లా స్థాయిలో ఎంత మేరకు ప్రభావం చేయగలుగుతారు? అనే వివరాలను కూడా పంపాలని చెప్పినట్లు తెలిసింది.

మరిన్ని వార్తల కోసం..

దేశాన్ని సరైన దిశలో తీస్కపోవడానికి ప్రయత్నాలు మొదలైనయ్​

భూముల రిజిస్ట్రేషన్లపై అదనపు బాదుడు!