
బీజేపీ కార్యాలయంలో తెలంగాణ వివెూచన దినోత్సవం ఘనంగా జరిగింది. అధికారికంగా జరపాల్సిన వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. ఎంఐఎంకు భయపడే వివెూచన దినాన్ని అధికారికంగా జరపడం లేదని ఆరోపించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలన్న బీజేపీ డిమాండ్ వెనుక… ఎలాంటి రాజకీయ ఆలోచనలు లేవన్నారు. నిజాం నుంచి తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు కాబట్టే… తెలంగాణ వివెూచన దినాన్ని జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు లక్ష్మణ్.