చెట్లు నరికేస్తున్నా పట్టించుకోరా?

చెట్లు నరికేస్తున్నా పట్టించుకోరా?

రంగారెడ్డి: మొక్కల పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ద‌ృష్టి పెట్టింది. ఇందులో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సర్కార్.. మొక్కలు నాటేందుకు పెద్ద ఎత్తున ఖర్చు పెడుతోంది. ప్రత్యేకంగా ప్రతి వర్షా కాలంలో స్పెషల్ డ్రైవ్‌లు పెట్టి లక్షలాది మొక్కలను నాటుతూ, వాటి సంరక్షణ కోసం నోడల్ ఆఫీసర్స్‌ను నియమిస్తోంది. అయితే చెట్ల రక్షణ కోసం సర్కార్ ప్రత్యేక నిధులు మంజూరు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ఆ మొక్కలు పెరిగి పెద్దవ్వక ముందే గొడ్డలిపెట్టుకు గురవుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా నగర శివారులోని రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, లస్కర్ గూడలో జరిగిన ఓ ఘటనను చెప్పొచ్చు. మొదటి విడత హరితహారంలో భాగంగా 2017లో లస్కర్ గూడలో కొన్ని మొక్కల్ని నాటారు. అవి ఇప్పుడు పెరిగి పెద్దయ్యాయి. అయితే వీటిని కొంతమంది స్థానికులు నరికి వేశారు. దీనిపై స్పందించాల్సిన అధికారులు.. నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో హరితహారం లక్ష్యం కాస్తా నీరుగారుతోందని ప్రజలు వాపోతున్నారు.