హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)లో పనిచేస్తున్న అధికారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రమోషన్లకు సంబంధించిన గరిష్ట వయసు పరిమితిని 56 ఏండ్ల నుంచి 59 ఏండ్లకు పెంచుతూ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 61 ఏండ్లకు పెరిగిన నేపథ్యంలో ప్రమోషన్ పొందాలంటే కనీసం రెండేండ్ల సర్వీస్ మిగిలి ఉండాలన్న నిబంధన మేరకు ఈ మార్పు చేశారు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా చోంగ్తు జీవో జారీ చేశారు.
