రేషన్ డీలర్ల కమీషన్ రూ.47 కోట్లు విడుదల

రేషన్ డీలర్ల కమీషన్ రూ.47 కోట్లు విడుదల

హైదరాబాద్, వెలుగు: రేషన్ డీలర్లకు జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రూ.47.19 కోట్ల కమీషన్​ను ప్రభుత్వం విడుదల చేసింది. సెంట్రల్ కార్డులకు కిలోకు రూ.0.50 పైసలు, స్టేట్ కార్డులకు రూ.1.40 చొప్పున కేటాయించింది. జూన్​కు సంబంధించి కమీషన్ రూ.15.74 కోట్లు, జులైలో రూ.15.72 కోట్లు, ఆగస్టులో రూ.15.72 కోట్లుగా ఉన్నాయి. 2025, జూన్ నుంచి రాష్ట్రంలో స్మార్ట్ పీడీఎస్ అమల్లోకి వచ్చింది. ఆధార్ బేస్డ్​గా పీడీఎస్ పోర్టల్ ద్వారా మార్జిన్ చెల్లింపులు చేస్తున్నారు.

 33 జిల్లాల్లో ఎన్ఎఫ్​ఎస్ఏ, ఎస్ఎఫ్ఎస్​ఏ కార్డుదారులకు సంబంధించిన వేర్వేరు నివేదికలను జిల్లా సివిల్ సప్లయ్స్ అధికారుల (డీసీఎస్​వో) లాగిన్ ద్వారా అందుబాటులో ఉంచింది. స్మార్ట్ పీడీఎస్ పోర్టల్​లో అప్​లోడ్ చేసిన డీలర్ల బ్యాంకు అకౌంట్ వివరాలను పరిశీలించాలని సివిల్ సప్లయ్స్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.