ఇప్పటికైనా విద్యుత్ కొనుగోలుపై ప్రభుత్వం స్పందించాలి

ఇప్పటికైనా విద్యుత్ కొనుగోలుపై ప్రభుత్వం స్పందించాలి

విద్యుత్ రంగంలో అవకతవకలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదని ఆ పార్టీ నేత NVSS ప్రభాకర్ అన్నారు. విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదని  ఆరోపించారు. విద్యుత్ అగ్రిమెంట్లపై కేసీఆర్ ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖలో భారీ కుంభకోణాలు జరిగినట్లు తమ దగ్గర ఆధారాలున్నాయన్నారు ప్రభాకర్. దీనిపై త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి విద్యుత్ కొనుగోల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతామన్నారు.

మరోవైపు కాంగ్రెస్ పై ఆరోపణలు గుప్పించారు ప్రభాకర్. కాంగ్రెస్ నాయకులెవరు విద్యుత్ కొనుగోలు అంశంపై ఇప్పటి వరకు సీబీఐ విచారణ కోరలేదన్నారు. TRS తో కాంగ్రెస్ కుమ్మక్కయినందుకే రేవంత్ కు మల్కాజిగిరి, ఉత్తమ్ కు నల్గొండ, కోమటి రెడ్డికి భువనగిరి గిఫ్ట్ గా వచ్చాయన్నారు. గతంలో వైఎస్సార్ చేసిన తప్పులకు అధికారులు బలయ్యారన్నNVSS ప్రభాకర్..కేసీఆర్ హయాంలో కూడా అలాగే జరుగుతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.