కరోనాతో ఉపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి

కరోనాతో ఉపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది దీనిపై టీజేఎస్ నేతలు జూమ్ ద్వారా ఆన్ లైన్ సభ నిర్వహించారు. అధ్యక్షుడు కోదండరాం, మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్ రెడ్డి తో  పాటు పలువురు ఆన్ లైన్ లో పాల్గొన్నారు. ఇందులో బాగంగా మాట్లాడారు.
కరోనా కారణంగా లక్షలాది మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయన్నారు. కొవిడ్ ప్రైవేట్  ఆస్పత్రులు శవాల మీద కూడా డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. రూపాయి ఖర్చు లేకుండా వ్యాక్సిన్ ఇస్తామన్న ప్రభుత్వ హామీ పూర్తిగా ఫుల్ ఫిల్ చేయాలన్నారు. కరోనా టెస్ట్ కిట్స్ అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య ఖర్చులు భరించే స్తోమత లేని పేద వాళ్ళ కోసం ప్రభుత్వమే వైద్యం అందించేలా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటూనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ బడ్జెట్ వైద్య ఆరోగ్య శాఖ కు కేసీఆర్ ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. కరోనా టైంలో కేసీఆర్ రాజకీయాలపై దృష్టి పెట్టారని విమర్శించారు. మొదట్లో అసెంబ్లీలో కూడా కరోనపై.. కేసీఆర్ నిర్లక్ష్యంగా మాట్లాడారని గుర్తు చేశారు.ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యం తో వున్నారన్నారు.నర్సులు, డాక్టర్ల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. పిపిఇ కిట్స్ ఇస్తామని కొంతమంది దాతలు ముందుకు వచ్చినా తీసుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా రాదని తెలిపారు.

కరోనా వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొవిడ్ సమస్యలు హైదరాబాద్ లో ఒకలా..గ్రామాల్లో ఒకలా ఉన్నాయన్నారు. కరోనా విషయంలో పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుందన్న సీఎం కేసీఆర్ ఇంకా అదే నిర్లక్ష్యం లో వున్నారన్నారు. కోవిడ్ తో ఉపాది కోల్పోయిన వాళ్లకు ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కేసులు, మరణాల సంఖ్యను ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందని విమర్శించారు. గ్రామాల్లో ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని..అవసరమైతే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద కరోనా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధానకై రేపు(ఆదివారం) ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఎవరి ఇంట్లో వాళ్లే మౌన దీక్ష చేయాలని టీజేఎస్ నేతలు పిలుపునిచ్చారు.