Rahul Gandhi at Lok sabha:బీజేపీ ప్రభుత్వం ఇండియాను అమ్మేసింది: ట్రేడ్ డీల్ పై రాహుల్ గాంధీ ఫైర్

Rahul Gandhi at Lok sabha:బీజేపీ ప్రభుత్వం ఇండియాను అమ్మేసింది: ట్రేడ్ డీల్ పై రాహుల్ గాంధీ ఫైర్

ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు లోక్ సభ ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ.  ట్రేడ్ డీల్ తో ఇండియాను అమెరికాకు అమ్మేసిందన్నారు. అమెరికా టారిఫ్ లను ఒప్పుకోవడం అంటే ట్రంప్ కు మోదీ సరెండర్ అయినట్లే అని రాహుల్ విమర్శించారు. దేశానికి ముప్పు ముంచుకొస్తుంటే ప్రధానిమోదీకి అర్థంకావడంలేదన్నారు. అమెరికా తారిఫ్ లతో భారత్ కు నష్టమే గానీ లాభం లేదన్నారు. ట్రేడ్ డీల్ తో అమెరికా సుంకాలు 3 నుంచి 18 శాతానికి ఎందుకు పెరిగాయో చెప్పాలన్నారు. మన చమురు కొనుగోళ్లపై ట్రంప్ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఇది 140 కోట్ల ప్రజలకు తీరని అవమానం అని రాహుల్ తీవ్రస్థాయిలో విమర్శించారు. 

ట్రంప్ టారిఫ్ లతో దేశ రైతాంగానికి తీరని నష్టం అన్నారు రాహుల్ గాంధీ. అమెరికా లోని కొన్ని ఉత్పత్తులకు  మోదీ ప్రభుత్వం గేట్లు బార్లా తెరిచిందన్నారు. దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతారన్నారు. 3శాతం ఉన్న టారిఫ్ 18 శాతానికి ఎందుకు పెరిగిందో మోదీ సమాధానం చెప్పారు. అమెరికా టారిఫ్ లతో టెక్స్ టైల్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. పార్టీ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కోసమే టారిఫ్ లకు మోదీ ఒప్పుకున్నారని విమర్శించారు. 

మోదీ కళ్లలో భయం కనబడుతోంది.. అందుకే మాట్లాడటం లేదు. అదానీ కంపెనీపై కేసుతో  ప్రధానిని అమెరికా టార్గెట్ చేస్తోంది.. అమెరికా చెప్పినట్లు మోదీ నడుస్తున్నారు. ఎవరి దగ్గర చమురు కొనాలో ట్రంప్ ఎలా నిర్ణయిస్తారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

భారత్ దగ్గర పుష్కలంగా డేటా ఉంది.. AI కి అందించే డేటాతో ప్రమాదం ఉంది.. డేటాకు సంబంధించిన బడ్జెట్లో ప్రత్యేక ప్రస్తావన లేదు..AI డేటా అనే  ఓ పెట్రోల్ లాంటిది. డాలర్ ను కాపాడుకునేందుకు అమెరికాకు మన డేటా అవసరమైంది.. అమెరికా సూపర్ పవర్ కావడం కోసమే మన డేటాను వాడుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. 
 

►ALSO READ | వందేమాతరంపై కొత్త గైడ్ లైన్స్.. మొదటి ఆరు చరణాలు తప్పనిసరి పాడాలి