కరోనాపై ప్రభుత్వం పెట్టిన ఖర్చులు నామమాత్రమే: ఉత్తమ్

కరోనాపై ప్రభుత్వం పెట్టిన ఖర్చులు నామమాత్రమే: ఉత్తమ్

రాష్ట్రంలో అరకిలోమీటర్ కు ఒక ఫుడ్ సెంటర్ అని సీఎం కేసీఆర్ అన్నారు..అయితే అవి ఎక్కడా కన్పించడం లేదని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రం లోNREGS పనులు ఆగిపోయాయని…దీంతో 7,500 మంది కరోనా కంటే ముందు నుంచే ఫీల్డ్ అసిస్టెంట్ లు సమ్మెలో చేస్తున్నారని తెలిపారు. తమను తిరిగి  విధుల్లోకి తీసుకోమని వారు కోరుతున్నా…కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు.

అంతేకాదు మున్సిపల్ పారిశ్యుద్ద కార్మికుల  గురించి సీఎం కేసీఆర్ చెప్పే మాటలు.. చేతల్లో లేవన్నారు ఉత్తమ్. వారికి సబ్బులు లేవు.. గ్లౌజ్ లు,శానిటైజేషన్ లేదన్నారు. వారికి అదనపు గిఫ్ట్ సంగతి పక్కకు పెడితే.. రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని చెప్పారు. శానిటైజేషన్ వర్కర్లు, పోలీసులు, హెల్త్ సిబ్బంది తో పాటు అత్యవసర సేవల్లో ఉన్న వారికి 30శాతం అదనంగా  జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

లాక్ డౌన్ తో ఆదాయం తగ్గింది అంటున్న సీఎం కేసీఆర్..గతంలో బాండ్ల ద్వారా సేకరించిన 3,500 కోట్ల రూపాయలు ఏమీ చేశారో సమాధానం చెప్పాలన్నారు. కరోనా వైరస్ ను అరికట్టడం కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చులు నామామాత్రమేనన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 22 రాష్ట్రాలలో ICMR గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో కరోనా వైరస్ టెస్ట్ లు చేస్తుంటే మన దగ్గర మాత్రం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

సోనియా గాంధీ సూచనలతో వలస కూలీలను ఆదుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాన్నారు ఉత్తమ్.