V6 News

రైతులకు  నాణ్యమైన  విత్తనాలను  అందిస్తాం : అన్వేష్ రెడ్డి

రైతులకు  నాణ్యమైన  విత్తనాలను  అందిస్తాం : అన్వేష్ రెడ్డి
  • విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి

కరీంనగర్ టౌన్: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి రైతులకు విత్తన కొరత లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, నాణ్యమైన విత్తనాలను తమ సంస్థ ద్వారా అందిస్తామని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్  అన్వేష్ రెడ్డి అన్నారు. వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే అంశంపై బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విత్తన డీలర్లు, సహకార సంఘాల సీఈవోలు, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీవోలు, ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ప్రతినిధులతో కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి ఆయన రివ్యూ చేశారు.  ఆయన మాట్లాడుతూ విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. సీడ్స్ కార్పొరేషన్ కరీంనగర్ యూనిట్ రంగపేట నుంచి నాణ్యమైన విత్తనాలను ఉమ్మడి జిల్లా రైతులకు సరఫరా చేస్తామన్నారు. 

 కరీంనగర్ రోల్ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలవాలి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన  రివ్యూలో కలెక్టర్ చిత్రామిశ్రా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో నిర్వహించనున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశాలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గురువారం మండల స్థాయిలో జరిగే సమావేశాలు సక్సెస్ చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్  కలెక్టర్  అశ్వినితానాజి  వాకడే, డీపీవో జగదీశ్వర్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి సీపీఓ రాందత్తారెడ్డి పాల్గొన్నారు.