నిరుద్యోగులను రెచ్చగొడ్తున్నరు : ​ రాంచంద్రునాయక్

నిరుద్యోగులను రెచ్చగొడ్తున్నరు : ​ రాంచంద్రునాయక్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ మోచేతి నీళ్లు తాగే కొందరు నేతలు ప్రజా పాలన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ ఫైర్ అయ్యారు. ‘‘గ్యాదరి కిషోర్, గువ్వల బాలరాజు, బాల్క సుమన్..  గత పదేండ్లుగా మీరు నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు వారిని రెచ్చగొడ్తున్నరు” అని ఆయన మండిపడ్డారు.

బుధవారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీస్ లో రాంచంద్రునాయక్ మీడియాతో మాట్లాడారు. పదేండ్లపాటు శవాల మీద కుర్చీ వేసుకుని కల్వకుంట్ల కుటుంబం దండుపాళ్యం ముఠాలా రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు.