చిట్యాల, వెలుగు : రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు న్యాయం చేస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు, సుంకేనపల్లి, గుండ్రంపల్లి, నేరడ, ఎలికట్టె గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలాఅండగా నిలుస్తుందని, రైతులు ఇబ్బంది పడకుండా పంటను విక్రయించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నర్రా వినోద మోహన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
