100 మంది ఉంటే ఆఫీస్ లోనే వ్యాక్సిన్..

100 మంది ఉంటే ఆఫీస్ లోనే వ్యాక్సిన్..

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ డోసులు ఎక్కువ మందికి ఇవ్వాలనే లక్ష్యంతో.. ఇకపై వ్యాక్సినేషన్ ను వర్క్ ప్లేస్‌లలోనూ పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 11వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించింది.

45ఏళ్లు పైబడిన వారందరికీ పని ప్రదేశాల్లోనే టీకా వేసేందుకు అనుమతించింది కేంద్ర ప్రభుత్వం. కనీసం 100 మంది వ్యాక్సిన్ వేయించుకొనేందుకు సిద్ధంగా ఉంటే అక్కడే వ్యాక్సినేషన్‌ చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.