ప్రైవేట్ రంగానికి అండగా నిలుద్దాం.. రాష్ట్రాలకు ప్రధాని పిలుపు

ప్రైవేట్ రంగానికి అండగా నిలుద్దాం.. రాష్ట్రాలకు ప్రధాని పిలుపు

న్యూఢిల్లీ: కరోనా వల్ల ఒడిదొడుకులకు గురైన దేశ ఎకానమీని తిరిగి గాడిన పెట్టాల్సి ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఇందుకు కఠినమైన విధానాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడం దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఆరో నీతి అయోగ్‌‌ మీటింగ్‌‌లో పాల్గొన్న మోడీ.. ప్రైవేట్ రంగం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ సెక్టార్ ఇంకా ఎదగాలని.. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలన్నారు. కరోనా టైమ్‌‌లో సెంటర్‌‌తో స్టేట్స్ కలసి పని చేశాయని, అందుకే దేశానికి మంచి పేరు వచ్చిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌‌లో భాగంగా ప్రైవేట్ రంగానికి మరింత తోడ్పాటును అందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.