ఒక్కరికి విద్యనందిస్తే మూడు తరాలకు మేలు : తమిళిసై

ఒక్కరికి విద్యనందిస్తే మూడు తరాలకు మేలు : తమిళిసై
  • పిల్లల్లో నేర్చుకునే తపన పెంచాలె
  • పేద విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందజేత

హైదరాబాద్, వెలుగు:  ఒక్కరికి విద్యను అందిస్తే మూడు తరాల మైండ్ సెట్ మార్చే అవకాశం కల్పించినట్లు అవుతుందని గవర్నర్ తమిళిసై అన్నారు. మంగళవారం రాజ్ భవన్ లో అక్షయ విద్య ఫౌండేషన్ సమకూర్చిన100 ల్యాప్ టాప్ లను పేద విద్యార్థులకు గవర్నర్ అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిలో చిన్నప్పటి నుంచే నేర్చుకునే తపన ఉండాలని, పిల్లలను టీచర్లు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.

 తగిన ప్రోత్సహాం ఉంటేనే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం కూడా పేదలకు అండగా ఉండేలా పని చేస్తుందన్నారు. కాగా, అయోధ్య బంగారు పాదుకలకు గవర్నర్ రాజ్ భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పాదుకలను అయోధ్యకు అందిస్తున్న చల్లా శ్రీనివాస్ శాస్ర్తిని గవర్నర్ అభినందించారు. 

తమిళిసైని కలిసిన నరసింహన్, షర్మిల 

గవర్నర్ తమిళిసైని మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు కలిశారు. రాష్ర్టానికి వచ్చిన నరసింహన్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కూడా గవర్నర్ తమిళిసైని కలిశారు. వచ్చే నెలలో తన కొడుకు పెళ్లికి అటెండ్ కావాలని కోరుతూ గవర్నర్ కు ఆమె ఇన్విటేషన్ అందజేశారు.