మోడ్రన్ స్టేట్ గా తెలంగాణ .. రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి దేశానికే ఆదర్శం: గవర్నర్

మోడ్రన్ స్టేట్ గా తెలంగాణ  .. రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి దేశానికే ఆదర్శం: గవర్నర్

 తెలంగాణ 2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకుంటుందన్నారు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.  ఆ దిశగా రేవంత్ సర్కార్ విజన్ తో పనిచేస్తోందన్నారు.  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ప్రారంబోత్సవ ఉపన్యాసం ఇచ్చిన ఆయన.. గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందన్నారు.  వికసిత్ భారత్ 2047లో తెలంగాణ రైజింగ్ ఓ భాగమన్నారు. 

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అడుగులేస్తోందన్నారు. తెలంగాణ అబివృద్ధి,ప్రగతి దేశానికే ఆదర్శమని చెప్పారు గవర్నర్. సీఎం రేవంత్ నాయకత్వంలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మహిళలకు అండగా ఉందన్నారు.  అన్ని రంగాల్లో తెలంగాణ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ను గవర్నర్ ప్రారంభించారు.  ఇవాళ్టి నుంచి నుంచి రెండు రోజుల పాటు ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ఈ మెగా ఆర్థిక సదస్సును  గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు.  ఈ సమ్మిట్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సదస్సును ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారు.

అంతకుముందు గ్లోబల్ సమ్మిట్ లో  ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు రేవంత్. సమ్మిట్  ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి,పలువురు మంత్రులు ఉన్నారు.

 2047 నాటికి రాష్ట్రాన్ని గ్లోబల్ పవర్‌‌ హౌస్‌‌గా మార్చాలన్న విజన్‌‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. అత్యంత ఆధునిక హంగులతో కూడిన వేదికలు, డిజిటల్ టన్నెళ్లు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణలు అతిథులకు స్వాగతం పలుకుతున్నాయి.. రాష్ట్రంలోని అపారమైన అవకాశాలను వివరించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను సాధించడమే ప్రధాన అజెండాగా ఈ సమిట్​ నిర్వహిస్తున్నారు.  దాదాపు మూడు వేల మంది దేశ, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు..!

తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమిట్​కు ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 44 దేశాలకు చెందిన 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు వస్తున్నారు. అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధుల బృందం హాజరయ్యారు. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి తేవడమే లక్ష్యంగా ఈ సమిట్​ జరుగుతోంది. సమిట్‌‌‌‌‌‌‌‌లో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్​ సత్యార్థి, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వంటి ప్రముఖులు ప్రసంగిస్తారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క కూడా తమ సందేశాన్ని వినిపించనున్నారు.