బాపు ఘాట్‌లో నివాళులు అర్పించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

బాపు ఘాట్‌లో నివాళులు అర్పించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

అక్టోబర్ 1 మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా లంగర్ హౌస్ లోని బాపు ఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ బాపూజీ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరైయ్యారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ లు మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు.