
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష పూజలు, సేవలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఉత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణోత్సవం జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలాలయంలో జరిగిన పూజల్లో స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు గవర్నర్ దంపతులు.
యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఎనిమిదోరోజుకు చేరుకున్నాయి. ఇవాళ స్వామి కళ్యాణం కన్నులపండుగగా నిర్వహించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గుట్ట పైన అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా గుట్ట కింద ప్రభుత్వ స్కూలు గ్రౌండ్ లో కల్యాణం రాత్రి 10 గంటలకు కళ్యాణం నిర్వహించనున్నారు.