హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ప్రకృతి ఆరాధనకు, మహిళా శక్తికి సద్దుల బతుకమ్మ పండుగ ప్రతీక అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. సద్దుల బతుకమ్మ(ఆదివారం) సందర్భంగా రాష్ట్రప్రజలకు గవర్నర్ ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. పూలతో బతుకమ్మను అలంకరించి గౌరమ్మను ఆరాధించడం ప్రకృతితో మనకున్న విడదీయరాని అనుబంధానికి నిదర్శనమని గవర్నర్ చెప్పారు.
ఈ పండుగ ప్రజల్లో భక్తిభావాన్ని, సాంస్కృతిక వారసత్వం పట్ల గౌరవాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని తెలిపారు. గౌరమ్మ దీవెనలతో
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ శుక్లా పేర్కొన్నారు
