ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డంకి కావొద్దు : గవర్నర్ శివప్రతాప్ శుక్లా 

ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డంకి కావొద్దు : గవర్నర్ శివప్రతాప్ శుక్లా 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకిగా కావొద్దని,   ప్రతిభావంతులకు అందించే సాయం వారి భవిష్యత్తుకు బాటలు వేస్తుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ను కేవలం ఆర్థిక సాయంగా భావించకుండా తమ జీవితాలను తీర్చిదిద్దుకునే అవకాశంగా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మంగళవారం లోక్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌లో మహామన మాలవీయ మిషన్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మహామన శిక్షా సేవా ప్రకల్ప్‌‌‌‌‌‌‌‌ కార్యక్రమంలో గవర్నర్‌‌‌‌‌‌‌‌ 28 మంది నిరుపేద విద్యార్థులకు రూ.5 లక్షల స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతరత్న పండిట్‌‌‌‌‌‌‌‌ మదన్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌ మాలవీయ విద్యను దేశ నిర్మాణానికి శక్తివంతమైన సాధనంగా భావించారని తెలిపారు.

వనరులు పరిమితంగా ఉన్నా సంకల్పం, పట్టుదలతో లక్ష్యాలను సాధించవచ్చని మాలవీయ జీవితం చాటిచెప్పిందన్నారు. ప్రతి విద్యార్థి తన కుటుంబం, సమాజం, దేశానికి సేవ చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు. మాలవీయ మిషన్‌‌‌‌‌‌‌‌ విద్యా సేవలను గవర్నర్‌‌‌‌‌‌‌‌ శుక్లా అభినందించారు. కార్యక్రమంలో గవర్నర్ స్పెషల్ సీఎస్ దాన కిషోర్, మహామన మాలవీయ మిషన్ ప్రెసిడెంట్ పీసీ జైన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌‌‌‌‌‌‌‌ వీర్‌‌‌‌‌‌‌‌ గోపాల్‌‌‌‌‌‌‌‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.