
- పేపర్ లీక్‌పై నివేదిక ఇవ్వండి
- టీఎస్‌పీఎస్సీ, డీజీపీ, సీఎస్‌కు గవర్నర్ తమిళిసై లేఖ
హైదరాబాద్, వెలుగు: టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళిసై కోరారు. ఈమేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, టీఎస్ పీఎస్సీ సెక్రటరీ అనితారామచంద్రన్‌కు గురువారం లేఖ రాశారు. లీకైన పేపర్ల వివరాలు, సిట్ విచారణ కాపీలను 48 గంటల్లోగా తనకు అందించాలన్నారు.
టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఉద్యోగ పరీక్షలు రాసిన రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు, వారు సాధించిన మార్కుల జాబితాను కూడా పంపించాలని గవర్నర్ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యల సమాచారాన్ని కూడా తనకు అందజేయాలన్నారు.