మహాగణపతికి తొలిపూజ.. హాజరైన గవర్నర్

 మహాగణపతికి  తొలిపూజ.. హాజరైన గవర్నర్

ఖైరతాబాద్ మహాగణనాథుడు తొలి పూజ అందుకున్నాడు. గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ తొలి పూజ చేశారు. వీరితో పాటు   మంత్రి తలసాని, ఎమ్యెల్యే దానం నాగేందర్  పాల్గొని వినాయకుడికి మహా హారతి ఇచ్చారు. వీరితో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం బడా గణేశ్ ని సందర్శించారు. 

అంతకుముందు ఈ ఖైరతాబాద్ వినాయకుడికి భారీ లడ్డును నిర్వాహకులు సమర్పించారు. ఈ సారి 63 అడుగుల ఎత్తులో కొలువుదీరిన శ్రీదశమహా విద్యాగణపతికి  మొదటగా పద్మశాలి సంగం తరపున పట్టు వస్త్రాలు, గరికపూస, వెండి జంజాన్ని నిర్వాహకులు సమర్పించారు. 

ALSO READ: యాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణం.. ఉచిత దర్శనానికి గంట

నవరాత్రుల సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఖైరతాబాద్, శాదన్ కాలేజ్, నిరంకారి, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్, మింట్ కంపౌండ్, నెక్లెస్ రోటరీ ల దగ్గర ట్రాఫిక్ డైవర్ట్ చేయనున్నారు ట్రాఫిక్ పోలీసులు.