ఆయుష్మాన్ భారత్​తో పేదలకు మేలు

ఆయుష్మాన్ భారత్​తో పేదలకు మేలు

ఆయుష్మాన్ భారత్​తో పేదలకు మేలు
గవర్నర్ తమిళిసై 

హైదరాబాద్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చాలా రాష్ర్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని గవర్నర్ తమిళిసై అన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ హెల్త్ స్కీమ్ లతోపాటు దీనిని అమలు చేస్తుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని ఆమె మంగళవారం ట్వీట్ చేశారు. ఈ స్కీమ్ తో హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ అందుతోందన్నారు. అందరికీ నాణ్యమైన, చవకైన వైద్యం అందుతోందంటూ ఆయుష్మాన్ భారత్ గణాంకాలతో ‘మై గవర్నమెంట్ ఇండియా’ పేరిట చేసిన ట్వీట్ కు గవర్నర్ ఈ మేరకు రీట్వీట్ చేశారు. దేశంలో 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ తో ప్రయోజనం కలుగుతోందని, ప్రపంచంలోనే ఇది అతిపెద్ద స్కీమ్ అని గవర్నర్ తెలిపారు.