మానవ జీవితంలో ఇంటర్నెట్ ఒక భాగమైంది

మానవ జీవితంలో ఇంటర్నెట్ ఒక భాగమైంది

కొండాపూర్ HICCలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే సెలెబ్రేషన్స్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. Global Ignite-2021 పేరుతో ఈ సెలెబ్రేషన్స్‎ని మిలీనియం ఇన్ఫోటెక్ సంస్థ నిర్వహిస్తోంది. మానవ జీవితంలో ఇంటర్నెట్ ఒక భాగం అయిపోయిందని గవర్నర్ అన్నారు. 

‘ప్రపంచంలో ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతున్న దేశాల్లో మన దేశం రెండో స్థానంలో ఉంది. డిజిటల్ ఇండియా కోసం మన ప్రధాని కొత్త పథకాలు తీసుకొచ్చారు. ప్రస్తుతం 2.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం ఉంది. 2024 కల్లా 6 లక్షల గ్రామాలకు అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వాటర్, ఫుడ్ లేకుండా ఉండగలుతాం కానీ, ఇంటర్నెట్ లేకుండా ఉండలేకపోతున్నాం. ప్రస్తుతం ఆన్‎లైన్ క్లాస్‎ల కోసం విద్యార్థులు ఎక్కువగా ఇంటర్నెట్ వాడుతున్నారు. కోవిడ్ 19 వాక్సినేషన్ వంటి డిజిటలైజేషన్ వల్ల ఈజీగా పూర్తి చేశాం. ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ వల్ల కోట్ల మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. వైద్యరంగంలోనూ ఇంటర్నెట్ కీలక పాత్ర పోషిస్తుంది. పేద విద్యార్థులకు సాయమందించేందుకు రాజ్‎భవన్ ఒక కొత్త ప్రోగ్రాం చేపట్టింది. యూజ్ చేసిన లాప్‎టాప్స్‎ని కలెక్ట్ చేసి... విద్యార్థులకు అందిస్తున్నాం. పేద విద్యార్థులకి యూజ్ చేసిన లాప్‎టాప్స్ అందించాలని ఐటీ కంపెనీలను, వాటిల్లో పనిచేసే ఉద్యోగులను కోరుతున్నాను’ అని గవర్నర్ తమిళిసై అన్నారు.

For More News..

బెయిలొచ్చినా విడుదలకాని ఆర్యన్ ఖాన్

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హౌస్ అరెస్ట్