ఆర్యన్ ఖాన్ ఈ రోజు విడుదలయ్యేనా?

ఆర్యన్ ఖాన్ ఈ రోజు విడుదలయ్యేనా?
  • సాయంత్రానికి విడుదలయ్యే చాన్స్
  • ఆర్యన్ లాయర్ సతీష్ మాన్‎షిండే

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టయి 3 వారాలపాటు జైళ్లో ఉన్న ఆర్యన్ ఖాన్ శుక్రవారం సాయంత్రానికి విడుదలయ్యే అవకాశముందని ఆయన తరపు లాయర్ సతీష్ మాన్‎షిండే అన్నారు. ‘ఆర్యన్ ఖాన్‎తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు హైకోర్టు గురువారం బెయిల్ ఇచ్చింది. అయితే హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఇంకా రాలేదు.  ఆ ఉత్తర్వుల కాపీ అందగానే.. వెంటనే ఇతర లాంఛనాలు పూర్తి చేసి స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టులో సమర్పిస్తాం. ఈ ప్రక్రియ అంతా పూర్తయి ఆర్యన్ ఖాన్ శుక్రవారం సాయంత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ ఏదైనా ఆలస్యమైతే మాత్రం ఆర్యన్ జైలు నుంచి శనివారం విడుదల అవుతాడు’ అని ఆయన అన్నారు.

 

For More News..

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హౌస్ అరెస్ట్

అప్పటి వెయిట్రస్​... ఇప్పటి మోడల్