బిల్లుల ఆమోదం నా పరిధిలో అంశం : గవర్నర్

బిల్లుల ఆమోదం నా పరిధిలో అంశం : గవర్నర్


హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఆమోదించిన  బిల్లుల పెండింగ్ పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. “ బిల్లుల ఆమోదం నా పరిధిలో అంశం. వీటిపై తనకు విస్తృత అధికారాలు ఉన్నయి. బిల్లులపై త్వరలో నిర్ణయం తీసుకుంటా. గవర్నర్ గా నా బాధ్యతలు నిర్వర్తిస్తా” అని తమిళిసై అన్నారు. సోమవారం రాజ్ భవన్ లో దీపావళి సందర్భంగా నిర్వహించిన ఓపెన్ హౌస్ లో మీడియా చిట్ చాట్ లో  గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 7 బిల్లులు ఆమోదం పొందాయి. వాటిని ప్రభుత్వం గవర్నర్ కు పంపగా ఇంత వరకు ఆమె ఆమోదం తెలపలేదు. వీటిలో వర్సిటీల్లో కామన్ రిక్రూట్ మెంట్, ఫారెస్ట్ యూనివర్సిటీ, మున్సిపాలిటీ యాక్ట్ సవరణ, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ బిల్లు, తెలంగాణ మోటార్ వెహికల్ ట్యాక్స్ బిల్లులు ఉన్నాయి.

గవర్నర్ కు ప్రజల శుభాకాంక్షలు

దీపావళి సందర్భంగా రాజ్ భవన్ లో నిర్వహించిన ఓపెన్ హౌస్ లో పబ్లిక్, పలువురు ప్రముఖులు గవర్నర్ కు శుభాకాక్షలు తెలిపారు. హెచ్ఆర్ సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ ప్రెసిడెంట్, రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ మిశ్రా, రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. కరోనా వల్ల రెండేండ్లుగా ఓపెన్ హౌస్ నిర్వహించట్లేదని గవర్నర్ అన్నారు. వ్యాక్సినేషన్ పూర్తి కావటం వల్లనే ఓపెన్ హౌస్ సాధ్యమయిందన్నారు. ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు.