శివసేనలో చేరిన గోవిందా 14 ఏండ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ

శివసేనలో చేరిన గోవిందా 14 ఏండ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ

ముంబై: బాలీవుడ్ నటుడు గోవిందా 14 ఏండ్ల తర్వాత రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. గురువారం ముంబైలో శివసేన పార్టీలో ఆయన చేరారు.  మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గోవిందా భావోద్వేగానికి గురయ్యారు.  ‘‘14 ఏండ్ల సుదీర్ఘ వనవాసం పూర్తయింది. రాజకీయాల్లోకి తిరిగి వచ్చాను.

నాకు అవకాశమిస్తే ఆర్ట్, కల్చరల్ రంగాల్లో సేవ చేస్తా. షిండే సీఎం అయిన్పటి నుంచి ముంబై అభివృద్ధి బాటలో ప్రయాణిస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఇండియా నమ్మశక్యం కాని విధంగా అభివృద్ధి చెందింది” అని గోవిందా తెలిపారు.  ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ.. “మోదీ ప్రభుత్వ విధానాలు గోవిందాకు నచ్చాయి. సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఆయన పని చేయాలనుకుంటున్నారు. టికెట్ కోసం పార్టీలో జాయిన్ కాలేదు” అని చెప్పారు. కాగా, గోవిందా గతంలో కాంగ్రెస్ తరపున లోక్ సభ ఎంపీగా గెలిచారు.