మ్యాపింగ్ పాలసీలో కేంద్రం కీలక మార్పులు

మ్యాపింగ్ పాలసీలో కేంద్రం కీలక మార్పులు

న్యూఢిల్లీ: దేశ మ్యాపింగ్ పాలసీలో కేంద్రం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ నిర్ణయం దేశీ కంపెనీలకు చాలా ప్రయోజనం చేకూర్చుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రధాని మోడీ స్పందించారు. డిజిటల్ ఇండియా దిశగా ఇదో కీలక అడుగని ఆయన చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ విజన్‌‌ను దృష్టిలో పెట్టుకొని సంస్కరణలు చేశామని స్పష్టం చేశారు.

‘డిజిటల్ ఇండియాకు ప్రేరణ కలిగించేలా మా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. జియోస్పేషియల్ డేటాను సరళీకరించడం ఆత్మనిర్భర్ భారత్‌‌లో విజన్‌‌లో కీలక ముందడుగు. ఈ సంస్కరణలు దేశంలోని అంకుర సంస్థలు (స్టార్టప్స్)కు చాలా అవకాశాలను కల్పిస్తాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్, రీసెర్చ్ ఇన్‌‌స్టిట్యూషన్స్‌‌కు కొత్త పరిష్కారాలను కనుగొనే దిశగా ఇది దోహదపడుతుంది. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయడంతోపాటు ఉద్యోగికతను కల్పించడంలోనూ ఈ మార్పులు ఉపయోగపడతాయి’ అని మోడీ ట్వీట్ చేశారు.