వ్యాక్సిన్‌‌తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మాకు సంబంధం లేదు

వ్యాక్సిన్‌‌తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మాకు సంబంధం లేదు

పూణె: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే దానికి టీకా కంపెనీలపై నెపాన్ని మోపొద్దని సీరం ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావల్లా తెలిపారు. ఈ మేరకు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎదురయ్యే సమస్యలకు తమను నిందించొద్దని ప్రభుత్వానికి తమ కంపెనీ తరఫున కోరనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తమకు ఈ మేరకు హామీ ఇవ్వాలని, లేకపోతే ఇలాంటి సమస్యలు వ్యాక్సిన్ కంపెనీల్లో భయాలను కలిగిస్తాయన్నారు. ఈ విషయంలో కంపెనీలకు సర్కార్ అండగా నిలవకపోతే అవి దివాలా తీసే ప్రమాదం పొంచి ఉందన్నారు.

‘టీకా తయారీదారులపై ఎవరైనా దావాలు, వ్యాజ్యాలు వేస్తే ప్రభుత్వమే నష్టపరిహారం ఇవ్వాలి. దీనిపై కోవ్యాక్సిన్‌‌తోపాటు మిగిలిన దేశాల్లోని వ్యాక్సిన్ తయారీదారులు చర్చించుకుంటున్నారు. వ్యాక్సిన్‌‌తో ఏదైనా సీరియస్ సమస్యలు తలెత్తితే కంపెనీలపై కేసు వేసే ఛాన్స్ ఉంది. అలాంటి తరుణంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి టీకా సంస్థలు భయపడతాయి. కాబట్టి వ్యాజ్యాలకు నష్టపరిహారం చెల్లించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. అమెరికా ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది’ అని పూనావల్లా పేర్కొన్నారు.