ట్విట్టర్‌‌‌‌కు కేంద్రం వార్నింగ్​

ట్విట్టర్‌‌‌‌కు కేంద్రం వార్నింగ్​

న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలకు సంబంధించి తప్పుడు ఇన్ఫర్మేషన్‌‌‌‌ను ప్రచారం చేస్తున్న ట్వీట్లు, లింకులను ట్విట్టర్‌‌‌‌  అన్‌‌‌‌బ్లాక్‌‌‌‌ చేయడంపై కేంద్రం సీరియస్ అయింది. తమ ఆదేశాలను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనపై కొందరు సోషల్‌‌‌‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారని కేంద్రం గుర్తించింది. 257 లింకులను, 1 హ్యాష్‌‌‌‌ ట్యాగ్‌‌‌‌ను వెంటనే బ్లాక్‌‌‌‌ చేయాలని ట్విట్టర్‌‌‌‌ను ఆదేశించింది. దీంతో 250 అకౌంట్లను ట్విట్టర్‌‌‌‌ సోమవారం నిలిపేసింది. 150 ట్వీట్లను తొలగించింది. కానీ కొన్ని గంటలకే మళ్లీ వాటిని అన్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ చేసింది. దీంతో కేంద్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సర్కారు ఆదేశాలను సంస్థ తప్పనిసరిగా పాటించాలి. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేసింది.