రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సింది

రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సింది

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వీటిని వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానాలో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ బిల్లులను రాజ్య సభలో ప్రవేశపెట్టిన సమయంలో విపక్ష నేతలు వ్యతిరేకించారు. అపోజిషన్ ఎంపీల నిరసనల మధ్యలో మూజువాణి ఓటుతో బిల్లులను ఆమోదించారు. ఈ నేపథ్యంలో బిల్లులపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ ప్రెసిడెంట్ మాయావతి స్పందించారు. వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చే ముందు రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందన్నారు. ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు రైతుల అభిప్రాయాన్ని తీసుకుంటే బాగుండేదన్నారు. యూపీలో బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ సంబంధిత విషయాలపై రైతులను పంచాయితీలకు పిలిపించి వారి అభిప్రాయాలను తెలుసుకునే వాళ్లమని పేర్కొన్నారు. రైతుల అభిప్రాయాల మేరకు అనేక నిర్ణయాలు తీసుకునే వాళ్లమన్నారు. కేంద్రం కూడా ఇదే రీతిన పంచాయత్‌‌‌‌లు నిర్వహించి రైతుల సూచనలు, అభిప్రాయాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాల్సిందన్నారు.