నాల్కోలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ జాబ్స్​

నాల్కోలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ జాబ్స్​

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) 277 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్‌‌లైన్‌‌ అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత :  65% మార్కులతో బీఈ, బీటెక్‌‌, (మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌‌స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, కెమికల్, కెమిస్ట్రీ), ఎంఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు గేట్-2023 మార్కులు సాధించి ఉండాలి. వయసు 3‌‌‌‌0 సంవత్సరాలు మించరాదు. 

సెలెక్షన్​:  ఇంజినీరింగ్‌‌లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2023 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.

అప్లికేషన్స్​:  అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఏప్రిల్​ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌‌ అభ్యర్థులకు రూ.500. ఇతరులకు రూ.100 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు www.nalcoindia.com వెబ్​సైట్​లో సంప్రదించాలి.