తమ సమస్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె 24 వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు విన్నూతంగా నిరసన చేపట్టారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం నుండి గ్రామపంచాయతీ భవనం వరకు రోడ్డుపై పొర్లు దండాలు చేశారు. 24 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపకపోవడం సరికాదన్నారు. వెంటనే పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పారు.
తమ ఉద్యోగాలన పర్మినెంట్ చేయాలని, మల్టీ పర్పస్ పని విధానాన్ని రద్దు చేయాలని, వేతనాలను పెంచి సకాలంలో అందజేయాలని 14 డిమాండ్లతో కార్మికులు ఆందోళన చేస్తున్నారు.

