పోస్టింగ్ లపై వివాదం : కార్యదర్శుల్లో ‘కొత్త’ పంచాయితీ!

పోస్టింగ్ లపై వివాదం : కార్యదర్శుల్లో ‘కొత్త’ పంచాయితీ!

కొత్తగా నియామకమైన కార్యదర్శులకు గ్రేడ్–1, గ్రేడ్–2 పెద్ద పంచాయతీలు ఇవ్వడం వివాదాస్పదంగా మారుతోంది. పది పదిహేనేళ్ల సర్వీసు ఉన్న తమను చిన్న పంచాయతీలకు పరిమితం చేసి, కొత్తగా వచ్చిన జూనియర్లకు పెద్ద పంచాయతీల్లో పోస్టింగ్ లు ఇవ్వడం ఏమిటని సీనియర్లు మండిపడుతున్నారు. అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారని, గ్రేడ్ ల ప్రకారం పంచాయతీ కార్యదర్శులను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

జనాభాను బట్టి గ్రామ పంచాయతీలకు కేటాయించిన గ్రేడ్‌ల ప్రకారమే పంచాయతీ కార్యదర్శు లను నియమించాల్సి ఉంది. కానీ అధికారులు ఆ నిబంధనను తుంగలో తొక్కారనే విమర్శలు వినిపిస్తున్నాయి . పది, పదిహేను ఏళ్ల సర్వీస్‌ ఉన్న తమను చిన్న పంచాయతీలకు పరిమితం చేసి, జూనియర్‌ కార్యదర్శు లకు గ్రేడ్‌–1, 2 గ్రామ పంచాయతీల్లో పోస్టింగ్‌ ఇవ్వడం ఏమిటని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 10న పరీక్ష నిర్వహించి, డిసెంబర్‌19న ఫలితాలు వెల్లడించింది. కోర్టు కేసులు, ఎన్నికల కోడ్‌ క్లియర్‌ అయ్యాక కొత్త కార్యదర్శులకు ఈ నెల12న హడావుడిగా పోస్టింగ్‌ ఇచ్చారు.

ఇక్కడే అసలు వివాదం మొదలైంది..

గ్రేడ్ ను పట్టించుకోకుండా పోస్టింగ్ రాష్ట్రం లోని పంచాయతీలను జనాభాను బట్టి గ్రేడ్‌–1, 2, 3, 4లుగా అధికారులు విభజిం చారు. కొత్తగా నియమితులయ్యే వారిని తొలుత గ్రేడ్‌–4 పంచాయతీ కార్యదర్శిగా సెలక్ట్‌ చేసేవారు. సీనియారిటీని బట్టి గ్రేడ్‌–3, గ్రేడ్‌–2, గ్రేడ్‌–1కు ప్రమోషన్‌ పొందేవారు. అయితే కొత్తగా ప్రకటిం చిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టులతో గ్రేడింగ్‌ విధానానికి ప్రభుత్వం గండికొట్టింది. వారికి ఎలాంటి గ్రేడ్‌ నిర్ధారించకుండానే నియమించింది.

సీనియర్ల గ్రేడ్‌ మారినా.. ఊరు మారలే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2003, 2006లో కాం ట్రాక్ట్‌ పద్ధతిలో ఉద్యోగంలో చేరిన కార్యదర్శు ల సర్వీస్ ను ప్రభుత్వం రెగ్యు లరైజ్‌ చేసింది. వీరిలో చాలా మంది ఏ గ్రామంలో మొదటి పోస్టింగ్‌ పొందారో ఇప్పటికీ అదే గ్రామంలో పనిచేస్తున్నా రు. ఎక్కువ కాలం ఒకే ఊరిలో ఉండడం వల్ల వారి తప్పు లేకున్నా కొన్నిసార్లు స్థానిక నేతలకు టార్గెట్‌అయిన సందర్భాలు చాలా ఉన్నాయి . 10–15 ఏళ్లుగా ఒకే గ్రామంలో విధులు నిర్వర్తిస్తూ అక్కడే గ్రేడ్‌–4 నుం చి- 3, 2, 1 పదోన్నతులు పొందినా ట్రాన్స్ ఫర్‌ కాలేదు.  అసెంబ్లీ ఎన్నికలకు ముం దు గ్రేడ్‌–3 నుం చి గ్రేడ్‌ –2కు పదోన్నతి పొందిన 331 మంది కార్యదర్శులకు ట్రాన్స్ ఫర్‌ అవకాశం కల్పించలేదు. ఖాళీగా ఉన్న 661 గ్రేడ్‌–1 జోనల్‌ పోస్టులను గ్రేడ్‌–1 కార్యదర్శు లతో భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాలు కోరినా అధికారులు పట్టించుకోలేదని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.