అంతర్జాతీయ వేదికపై గూస్‌బంప్స్ వచ్చేలా .. గ్రామీ విజేత రికీ కేజ్ జాతీయ గీత ప్రదర్శన

అంతర్జాతీయ వేదికపై గూస్‌బంప్స్ వచ్చేలా .. గ్రామీ విజేత రికీ కేజ్ జాతీయ గీత ప్రదర్శన

బ్రిటన్ గడ్డపై గ్రామీ విజేత రికీ కేజ్ భారతదేశ జాతీయ గీతాన్ని సరికొత్త రీతిలో ప్రదర్శించారు. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా సహకారంతో రికీ కేజ్ జాతీయ గీతాన్ని అత్యద్బుతంగా ప్రదర్శించారు. లండన్‌లోని ప్రముఖ అబ్బే రోడ్ స్టూడియోస్‌లో ది రాయల్‌ ఫిల్హార్మోనిక్‌ ఆర్కెస్ట్రాకు చెందిన 100 మంది బృందంతో జనగణమన గీతాన్ని రికార్డు చేశారు.

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనగణమన వీడియోను ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. భారత జాతీయ గీతాన్ని రికార్డు చేసిన అతిపెద్ద ఆర్కెస్ట్రా ఇదేనని చెప్పారు. 

బ్రిటన్‌కు భారత హైకమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామి.. రికీ కేజ్‌ పై పొగడ్తల వర్షం కురిపించారు. నెటిజన్లు సైతం అద్భుతమైన ప్రదర్శన అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

రికీ కేజ్‌..  మూడు సార్లు గ్రామీ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.  1946లో స్థాపించిన ది రాయల్‌ ఫిల్హార్మోనిక్‌ ఆర్కెస్ట్రాకు బ్రిటన్‌లో మండి డిమాండ్ కలిగిన ఆర్కెస్ట్రాగా గుర్తింపు ఉంది.