పాల్వంచ, వెలుగు : పాల్వంచలో ఆదివారం మంత్రి, పెద్దపెల్లి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బర్త్‌డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బూర్గుల విజయభాస్కర్ రావు ఆధ్వర్యంలో స్థానిక మాల అసోసియేషన్ కార్యా లయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయభాస్కర్ మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి చేపట్టాక మైనింగ్, కార్మిక శాఖల విభాగంలో అద్భుతమైన సేవ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్మి కులు,యువకులు కచ్చా రమేశ్, వేమూరి సంపత్, బొజ్జ కిరణ్, ఎర్ర సంజయ్, విల్సన్, వరుణ్ ప్రసాద్, టిల్లు, గౌతమ్, చిన్న పండు పాల్గొన్నారు.
