మంథనిలో ఘనంగా  జంద్యాల పౌర్ణమి వేడుకలు.?

మంథనిలో ఘనంగా  జంద్యాల  పౌర్ణమి వేడుకలు.?

పెద్దపల్లి జిల్లా మంథని లోని శిలేశ్వర - సిద్దేశ్వర ఆలయంలో జంద్యాల పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజును జంధ్యాల పూర్ణిమ లేదా రాఖీ పౌర్ణిమ అని అంటారు. ఈ రోజున ముఖ్యంగా ద్విజులైన బ్రాహ్మణులు ఉపాకర్మ నిర్వహించి, పాత యజ్ఞోపవీతాన్ని తొలగించి కొత్త జంధ్యాన్ని (యజ్ఞోపవీతం) ధరిస్తారు.జంధ్యాన్ని కేవలం దారం అని కాకుండా ధర్మం, బాధ్యత, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. కొత్త జంధ్యం ధరించడం ద్వారా వేదాధ్యయనం, సత్కర్మలు, ఆధ్యాత్మిక నియమాలను మరింత నిష్ఠగా పాటించాలని సంకల్పిస్తారు. 


పలు  దేవాలయాల్లో బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి నూతన జంధ్యాలను ధరించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా మంథని పట్టణంలోని పలు దేవాలయాల్లో జంద్యాల పున్నమి వేడుకలు ఘనంగా జరిగాయి.‌ వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పాత యజ్ఞోపవీతాలను విసర్జించి, నూతన జంధ్యాలను ధరించారు. ఈ సందర్భంగా వేదపండితులు జంద్యాల పున్నమి విశిష్టతను వివరించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన వేడుకల్లో బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జంద్యాల పున్నమి సందర్భంగా నిర్వహించిన పూజలు, హోమాలతో ఆలయ ప్రాంగణాలు వేద మంత్రోచ్చారణలతో మార్మోగాయి.