సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌: ఘనంగా కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌: ఘనంగా కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి

పద్మారావునగర్/మల్కాజిగిరి, వెలుగు : హైదరాబాద్ తొలి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతిని సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ జేబీఎస్ ప్రాంగణంలో నిర్వహించారు. కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్​హాజరై కొరివి కృష్ణస్వామి విగ్రహానికి నివాళులర్పించారు. అలాగే, బోయిగూడలోని ముదిరాజ్ భవన్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ గవర్నర్, బండారు దత్తాత్రేయ, ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జి. దివాకర్ పాల్గొన్నారు. 

బోయిగూడలో..

మల్కాజ్ గిరి: బోయిగూడ ముదిరాజ్ భవన్‌‌‌‌‌‌‌‌లో ముదిరాజ్ మహాసభ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జి.దివాకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ లీడర్​బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.