
దున్న పోతుల విన్యాసాలు, యాదవుల తీన్మార్ స్టెప్పులు, డప్పు దరువులతో నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తా బుధవారం రాత్రి దద్దరిల్లింది. కళాకారుల నృత్యాలు, ఆట పాటల మధ్య సదర్ సంబురం అంబరాన్నంటింది. దున్న పోతుల వీరంగాన్ని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
ముషీరాబాద్, దోమలగూడలోనూ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆయా చోట్ల హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసనమండలి మాజీ స్పీకర్ మధుసూదనచారి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకట్ హాజరయ్యారు.