జడ్జెస్ కాలనీలో భారీ చోరీ: ఒకే రాత్రి 9 ఇళ్లలో దొంగతనం...

జడ్జెస్ కాలనీలో భారీ చోరీ: ఒకే రాత్రి 9 ఇళ్లలో దొంగతనం...

మహారాష్ట్ర అమరావతి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. సామాన్యుల ఇళ్లనే కాదు, ఏకంగా న్యాయమూర్తుల (జడ్జీల) ఇళ్లకే కన్నం వేసి పోలీసులకు సవాల్ విసిరారు. ఈ ఘటనతో జిల్లాలో భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

ఏం జరిగిందంటే... ఆదివారం అర్ధరాత్రి కాంతానగర్ ప్రాంతంలోని 9 ఇళ్లలోకి దొంగలు చొరబడ్డారు. ఇందులో 5 ఇళ్లు న్యాయమూర్తులవి, మిగిలిన 4 ఇళ్లు కోర్టు సిబ్బందికి చెందినవి. నల్దమయంతి కాలనీ, పైంగంగా భవనంలోని ఇళ్లను దొంగలు టార్గెట్ చేశారు. కాలనీ వెనుక ఉన్న గోడను ఎక్కి, అక్కడ ఉన్న పొదల నుంచి లోపలికి ప్రవేశించి దొంగతనాలు చేసి మళ్లీ అదే దారిలో పారిపోయారు.

పోలీసుల నిఘా ఉన్నా కూడా: 
ఈ ప్రాంతంలో పోలీసుల కాపలా ఉన్న... దొంగలు పక్కా ప్లాన్‌తో వచ్చారు. ఏ ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయో ముందే తెలుసుకుని మరీ దోచుకున్నారు. దొంగలు పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డయ్యాయి. ఎంత సొమ్ము పోయిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : రీల్స్ కోసం 160 స్పీడుతో కారు నడిపిన మైనర్..

పోలీసు వేషంలో వచ్చి.. వృద్ధుడికి టోపీ!
మరో ఘటనలో, పూణే సమీపంలోని పింప్రి చించ్వాడ్‌లో పోలీసులు ఒక ఘరానా మోసగాడిని పట్టుకున్నారు. ముహమ్మద్ సయ్యద్ కంబర్ అలీ (40 ఏళ్లు) అనే నిందితుడు పోలీసు అధికారిలా నటిస్తూ వృద్ధులను భయపెట్టి దోచుకుంటుంన్నాడు.  ఫిబ్రవరి 7న ఒక 70 ఏళ్ల వృద్ధుడు గుడి నుంచి వస్తుండగా, ఇద్దరు వ్యక్తులు అతడిని అపి.. మేము పోలీసులమని అంటూ, ఈ మధ్య దొంగతనాలు ఎక్కువయ్యాయి.. ఒంటి మీద బంగారం తీసేయండి అంటూ  నమ్మబలికారు.

దింతో  ఆ వృద్ధుడి అతని దగ్గరున్న రూ. 2.23 లక్షల విలువైన ఉంగరం, గొలుసు తీయించి.. వాటిని ఒక కాగితంలో చుట్టినట్టు నటించి రాళ్లను ఇచ్చారు. వృద్ధుడు తీరా చూసుకునేలోపే అసలు బంగారం కొట్టేసి పరారయ్యారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి థానే జిల్లాలో నిందితుడిని అరెస్ట్ చేశారు.