
అది హరిద్వార్లోని కాంగ్రాఘాట్..ఇక్కడికి దేశం నలుమూలలనుంచి భక్తులు వస్తుంటారు. ఫుణ్య స్నానాలు చేస్తుంటారు. గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంలో పొరపాటున పడితే అంతే సంగతులు.. అంత ఉధృతంగా ప్రవహిస్తోంది. జూలై 26, 2024 శుక్రవారం నాడు కాంగ్రాఘాట్ వద్ద గంగలో స్నానానికి దిగిన ఓ భక్తులు కాలు జారి నదిలో పడిపోతే అక్కడే ఉన్న రెస్క్యూ టీం అతడిని రక్షించారు. రెస్క్యూ టీం పనే అది కదా..ఇందులో చెప్పటానికి ఏముందీ అనుకుంటున్నారా..? గంగలో కొట్టుకుపోతున్న శివభక్తుడిని వారు ఎంతో సాహసంతో కాపాడిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది.
काल भी उसका क्या बिगाड़े,
— Dr Monika Singh (@Dr_MonikaSingh_) July 26, 2024
जो भक्त हो महाकाल का??️
कांगड़ा घाट, हरिद्वार पर गंगा की तेज लहरों में बह रहे शिवभक्त को SDRF जवानों ने कड़ी मशक्कत के बाद सकुशल बचा लिया। pic.twitter.com/ySTISNVIyD
శుక్రవారం గంగలో స్నానానికి దిగిన ఓ శివభక్తుడు కాలి జారి నదిలో పడిపోయాడు. ఎక్కడ పడ్డాడో తెలియదు గానీ.. హరిద్వార్ లోని కాంగ్రా ఘాట్ వద్ద గంగానది వరద ప్రవాహంలో కొట్టుకుపోతూ కనిపించాడు. ఎంత బరువైన వస్తువులైన ఇట్టే ఈ ప్రవాహంలో కొట్టుకుపోగలవు..పెద్ద పెద్ద రాళ్లను సైతం ఈజీగా తోసుకెళ్లేంత ఉధృతి.. అటువంటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనిషిని ఎలా పట్టుకోవాలని.. సరైన అంచనా వేసుకొని మరీ ప్రవాహంలోకి దూకిన ఎస్డీఆర్ఎఫ్ సభ్యుల ధైర్యం, సాహసానికి చూసేవారంతా ఫిదా అయిపోయారు. హరిద్వార్‌లోని కాంగ్రా ఘాట్ వద్ద బలమైన గంగలో కొట్టుకుపోతున్న శివభక్తుడిని SDRF సిబ్బంది చాలా ధైర్యంగా సురక్షితంగా రక్షించారు.