మరో 22 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు గ్రీన్ సిగ్నల్ 

మరో 22 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు గ్రీన్ సిగ్నల్ 
  • మౌలిక వసతులకు రూ.220 కోట్లు
  • పరిపాలనా అనుమతులిచ్చిన సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలను సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా మరో 22 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (టీజీపీఎస్) ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ స్కూళ్లను మోడల్ విద్యాసంస్థలుగా తీర్చిదిద్ది, సమగ్ర మౌలిక వసతులు కల్పించేందుకు రూ.220.70 కోట్ల నిధులను కేటాయించింది.

ఈ మేరకు జీవో 187,188ను విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా రిలీజ్ చేశారు. ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఆధునిక వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీవో నెంబర్ 187 కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం జడ్పీహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను టీజీపీఎస్‌‌‌‌‌‌‌‌గా మారుస్తున్నారు.

వీటి అభివృద్ధి కోసం రూ. 14.75 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జీవో నెంబర్ 188 ద్వారా రాష్ట్రంలోని 20 టీజీపీఎస్‌‌‌‌‌‌‌‌లను మంజూరు చేశారు. వీటికి రూ. 205.95 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతులిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని జడ్పీహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్ హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌తోపాటు తాండూరు, మధిర, పాలకుర్తి, కాజీపేట, పరకాల, భద్రాచలం, నిజామాబాద్ అర్బన్, బోధన్, సత్తుపల్లి, హుజూరాబాద్, చొప్పదండి, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, బోథ్, ఖానాపూర్, షాద్‌‌‌‌‌‌‌‌నగర్, చేవెళ్ల, పరిగిలోని స్కూళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా, ఇప్పటికే 4  డెమో మోడల్ స్కూళ్లు ఉండగా, వీటితోపాటు మరో 93 పబ్లిక్ స్కూళ్లకు అనుమతులిచ్చారు. కొత్తగా మంజూరైన 22 స్కూళ్లు కలిపి ఆ సంఖ్య 119కి చేరింది. 

ఏఐఐబీ రుణంతో నిర్మాణ పనులు

ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి మొత్తం నిధుల్లో 30 శాతం రూ. 66.21 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి విడుదల చేయనున్నారు. మిగిలిన 70 శాతం నిధులను రూ.154.48 కోట్లు  ఏషియన్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) రుణం ద్వారా సమీకరించనున్నారు. ఈ పనులన్నింటినీ ఇంజినీరింగ్ నిబంధనలకు తగ్గట్టుగా, ఈ- ప్రొక్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ ద్వారా -టెండర్లు పిలిచి పారదర్శకంగా చేపట్టాలని తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూఐడీసీ) ఎండీని ప్రభుత్వం ఆదేశించింది.

మరిన్ని వార్తలు