దుద్యాలలో ఫార్మా విలేజ్​కు గ్రీన్ ​సిగ్నల్

దుద్యాలలో ఫార్మా విలేజ్​కు గ్రీన్ ​సిగ్నల్
  • భూ సేకరణ చేస్తోన్న అధికారులు

కొడంగల్, వెలుగు: వలసలకు కేరాఫ్​గా ఉన్న కొడంగల్​ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్​రెడ్డి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రానుంది. గ్రీన్​ఫీల్డ్​క్లస్టర్​లో భాగంగా దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్​ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. ఇందుకు దాదాపు 1200 ఎకరాల భూమి సేకరించేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించారు.

ఇప్పటికే గ్రామాల్లో పర్యటించి భూములను పరిశీలిస్తున్నారు. గ్రామ పెద్దలు, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. ఫార్మా విలేజ్​ఏర్పాటు చేస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.  సరైన ఉపాధి అవకాశాలు లేక ఇక్కడి ప్రజలు హైదరాబాద్, ముంబై వంటి ప్రాంతాలకు వలస పోతున్నారు.