గ్రీన్​టీతో పళ్లు క్లీన్​

గ్రీన్​టీతో పళ్లు క్లీన్​

హెల్త్​ని కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం. ఎక్కువ మంది మిగతా  విషయాల మీద కాన్సన్​ట్రేషన్​ చేసినంతగా పళ్ల మీద చేయరు. నిజానికి నోటిని శుభ్రంగా ఉంచుకుంటే సగం ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టే. మనకి అందుబాటులో ఉండే వాటితోనే పళ్లను, నోటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు. గ్రీన్​ టీలో పళ్లను కాపాడే లక్షణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు.

పళ్లకు సంబంధించిన సమస్యల్లో పాచి ఒకటి. అది పళ్ళు పుచ్చి పోవడానికి కారణమవుతుంది. గ్రీన్​టీ తీసుకోవడం వల్ల దీని బారి నుంచి బయటపడొచ్చు. గ్రీన్​టీలో ‘ఎపిగల్లోకాటెజిన్ గాలెట్’​  ఉంటుంది. ఇది పుచ్చిపోవడానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో విపరీతంగా పోరాడుతుంది. కొన్నికొన్ని సార్లు మనం తీసుకునే ఫుడ్​లోని చిన్నచిన్న తునకలు పళ్లలో ఇరుక్కుని, బ్యాక్టీరియా ఫామ్​ అయి, దంత క్షయానికి కారణమవుతుంది. ఈ విషయంలోనూ గ్రీన్​టీ సాయపడుతుంది. బ్యాక్టీరియాను తగ్గించడంలో గ్రీన్​టీ మంచి రోల్​ పోషిస్తుందని ఎన్నో స్టడీస్​ చెప్తున్నాయి. నోటికి సంబంధించిన ఎఫెక్ట్​ గొంతు వెనక భాగానికి కూడా పాకుతుంది. అక్కడ బ్యాక్టీరియా పెరిగి నోటి దుర్వాసనకు కారణమవుతుంది. ఆ ప్రదేశాన్ని టూత్​బ్రెష్​తో కూడా క్లీన్ చేయలేం. దాంతో ఒకసారి బ్యాక్టీరియా చేరాక, దుర్వాసనను దూరం చేయడం కష్టమైన పని. దీనికి కూడా గ్రీన్​ టీ ఉపయోగపడుతుంది. గ్రీన్​టీలోని పాలీఫెనాల్స్ ఈ బ్యాక్టీరియాను అడ్డుకోవడంలో సాయపడుతుంది.

మరిన్ని వార్తలు

మెట్రో అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

విజయ్ దేవరకొండ ఆర్థిక సహాయం: గోల్డ్ మెడల్ కొట్టిన కిక్ బాక్సర్

ఈ హోటల్స్​లో ఖర్చు తక్కువ

మెట్రో విస్తరించకుండా MIM అడ్డుకోగా TRS వంతపాడింది..