రంగుల్లో పింక్ కలర్ క్వీన్ ఎలాగో ఫుడ్ విషయంలో కూడా ఇవి క్వీన్సే. పింక్ కలర్ లో ఉండే పళ్లు, కూరగాయలేవైనా చాలా హెల్దీ. డైలీ ఒక పండుని తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. స్కిన్ పై కొత్త మెరుపు వస్తుంది. చాలా రకాల జబ్బులు దూరంగా ఉంటాయి. అందుకే వాటిని కచ్చితంగా డైలీ ఫుడ్ మెనూలో ఓ పార్ట్ చేసుకోవాలంటున్నారు న్యూట్రిషియన్లు.
పింక్ జామ
ఏ సీజన్ లోనైనా అందుబాటులో ఉండే పండు జామకాయ. ఇందులో లోపల పింక్ కలర్ లో ఉండే జామకాయలు తింటే శరీరంలో బ్లడ్ బాగా పెరుగుతుంది. గర్భిణీలకు ఇది చాలామంచిది. శరీరంలో బ్లడ్ కంటెంట్ లెవెల్ పడిపోకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. డైలీ ఒక జామకాయ తినడం వల్ల క్యాన్సర్ కు దూరంగా ఉండొచ్చు. స్కిన్ పై గ్లో బాగా పెరుగుతుంది.
బీట్ రూట్ జ్యూస్
రెబ్ బ్లడ్ బీట్ రూట్ జ్యూస్. ఇది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ దీన్ని తాగడానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఈ పింక్ బ్యూటీలో ఉన్న బెనిఫిట్స్ ను ఒక్కసారి గుర్తు చేసుకుంటే..దాన్ని తాగకుండా ఉండలేరు. విటమిన్స్, మినరల్స్ తో పాటు ఇందులో ఫోలేట్, లైకోపీన్, ఆంథోసైన్సిస్ వంటివి ఎన్నో ఎక్కువగా ఉన్నాయి. వైట్, రెడ్ బ్లడ్ సెల్స్ తయారు చేయడానికి, కార్బొహైడ్రేట్స్ ను శక్తిగా మార్చడానికి ఫోలేట్ చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గర్భిణీలకు ఇది చాలా హెల్దీ. పిల్లలకు పుట్టుకతో వచ్చే జబ్బులను బీట్ రూట్ దూరం చేస్తుంది.
వాటర్ మిలన్
జూస్.. సలాడ్..ఏ రూపంలో పుచ్చకాయను తిన్నా బాడీకి హై లెవెల్ లో ఎనర్జీ అందుతుంది. బ్లడ్ ప్రెషర్ ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. హార్ట్ కు సంబంధించిన జబ్బులు, శరీరంలో పెరిగే మంటపై తీవ్రంగా ఫైట్ చేస్తుంది. సో...పుచ్చకాయ ఎక్కువగా తినేవారిలో హార్ట్, బీపీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ తక్కువ.
పొమేలో
పెద్ద సంత్రాలా ఉండే ఈ పంపర పనస పండును చాలామంది తినరు. కాని.. దీనిలో చాలా పోషక విలువలున్నాయి.. ఇమ్యూనిటీని పెంచడంలో పొమేలో బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడే పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. జలుబు, ఫ్లూ వంటి జబ్బులను కూడా ఇది దూరంగా ఉంచుతుంది. అందుకే డైలీ లైఫ్ లో ఈ పింక్ ఫుడ్స్ ను ఓ పార్ట్ చేసుకుని తీరాలి.
రాస్ బెరీస్
వీటిని చూస్తేనే చాలు అమాంతంగా నోటిలో వేసుకోవాలని ఉంటుంది. ఇలా ప్రతి రోజు ఒక రాస్ బెరీని తింటే చాలా జబ్బులకు దూరంగా ఉండొచ్చు. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది వెయిట్ తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. డైలీ ఒక పండు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. డైజీషన్ ఇబ్బంది ఉన్నవాళ్లకు ఇది చాలా మంచిది.
డ్రాగన్ ఫ్రూట్
డైలీ ఫుడ్ మెనూలో ఉండాల్సిన ఇంకో పింక్ బ్యూటీ డ్రాగన్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ శరీరాన్ని హెల్దీగా ఉంచేందుకు దోహదపడుతుంది. విటమిన్ బి, సి, ఫైబర్.. ఈ పండులో ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని ప్రతిరోజు తినాలి.
