రూ.19 కోట్ల క్యాష్, నగలు రిలీజ్ : మధుసూదన్

రూ.19 కోట్ల క్యాష్, నగలు రిలీజ్ :  మధుసూదన్

హైదరాబాద్,  వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడిన రూ.19 కోట్లకు పైగా క్యాష్​, నగలను గ్రీవెన్స్ కమిటీ విడుదల చేసింది. మంగళవారం గ్రీవెన్స్ కమిటీ చైర్మన్ మధుసూదన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  హైదరాబాద్‌‌‌‌లోని ఆయా ప్రాంతాల్లో నిఘా బృందాలు క్షేత్రస్థాయి తనిఖీలు చేస్తున్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధం లేని క్యాష్​, నగలను  జిల్లాల్లోని  డిస్ట్రిక్ట్‌‌‌‌ గ్రీవెన్స్‌‌‌‌ కమిటీ విడుదల చేస్తుందన్నారు.

ఇందులో భాగంగా రూ.33 కోట్ల 95 లక్షల 7 వేల విలువైన క్యాష్, నగలకు సంబంధించి 206 అప్పీళ్లు వచ్చాయన్నారు. అయితే, 181 అప్పీళ్లకు సంబంధించిన రూ.19 కోట్ల 4 లక్షల 31వేల క్యాష్, నగలను విడుదల చేశామన్నారు. రూ.14 కోట్ల 58 లక్షల 65 వేల 238 క్యాష్, నగలకు సంబంధించిన 19 అప్పీళ్లను ఇన్ కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్​మెంట్లకు సిఫార్సు చేశామన్నారు. రూ. 32 లక్షల 10 వేల 440 విలువైన 6 అప్పీళ్లు పెండింగ్​లో ఉన్నాయన్నారు. సమావేశంలో కమిటీ మెంబర్ సెక్రటరీ శరత్ చంద్ర, జిల్లా ట్రెజరీ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ వసుంధర  పాల్గొన్నారు.