కలిసి ఆడి.. కరోనా అంటిచ్చుకున్నరు

కలిసి ఆడి.. కరోనా అంటిచ్చుకున్నరు

దిమిత్రోవ్, కోరిక్ కు పాజిటివ్
జొకోవిచ్‌ కోచ్‌కు కూడా
ఏడ్రియా చారిటీ టోర్నీలో కలకలం
ఈవెంట్‌ప్లాన్‌ చేసిన జొకో పై తీవ్ర విమర్శలు

చిన్న అలసత్వం.. ఇద్దరు టెన్నిస్ ప్లేయర్లకు కరోనా సోకేలా చేసింది..! చిన్న తప్పిదం.. ఓ స్టార్ ప్లేయర్ ను విమర్శలు ఎదుర్కొనేలా చేసింది..! గవర్నమెంట్ ఇచ్చిన సడలింపు.. 4 వేల మంది ఫ్యాన్స్‌ను భయంలోకి నెట్టింది..! కలిసి ఆడామన్న ఆనందంలో చేసుకున్న పార్టీతో మరెంత మంది ప్లేయర్లు వైరస్ బారిన పడతారోనన్న టెన్షన్ మొదలైంది..! ఈ దెబ్బకు టెన్నిస్‌ రీస్టార్ట్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి..! ఓవరాల్‌గా ఇతర ఆటలను తిరిగి ప్రారంభించే విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది..!

జాగ్రెబ్ (క్రొయేషియా): టెన్నిస్ వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఏర్పాటు చేసిన ఓ ఎగ్జిబిషన్ టోర్నీ తీవ్రవిమర్శల పాలైంది. ఇందులో పాల్గొన్న ఇద్దరు ఆటగాళ్లు గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా), బోర్నా కొరిచ్‌ (సెర్బియా)తో పాటు జొకో పర్సనల్ కోచ్‌ కరోనా బారిన పడ్డారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న గ్రిగర్‌, బోర్నాకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ రిజల్ట్ రావడంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ చికిత్స తీసుకుంటున్నారు.అంతేకాదు జొకో ఫిట్‌నెస్‌ కోచ్‌ మార్కోపానికికి వైరస్ సోకినట్టు కన్ఫామ్‌ అయింది. దాంతో, జొకోవిచ్ తో పాటు ఇతర ప్లేయర్లను కరోనా భయం వెంటాడుతోంది. జొకోలో ప్రస్తుతానికి వైరస్‌ లక్షణాలు కనిపించడం లేదని ఆర్గనైజర్లు చెబుతున్నారు. సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌ చేరుకున్న వెంటనే అతనికి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా, అమెరికాలో కరోనా ఎక్కువగా ఉందన్నఆందోళనతో యూఎస్ ఓపెన్లో ఆడేందుకు వెనకడుగు వేసిన జొకో.. ఇప్పుడు తనపైనే విమర్శలు రావడంతో ఏం సమాధానం చెబుతాడో చూడాలి.

అంతా జొకో ఆధ్వర్యంలోనే..
లాస్ట్ వీక్ సెర్బియా, క్రొయేషియా ప్లేయర్లతో కలిసి బెల్గ్రేడ్, జడార్(క్రొయేషియా) వేదికలుగా రెండు వీకెండ్స్ లో ఏడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీ (చారిటీ ఈవెంట్)ని జొకోవిచ్ నిర్వహించాడు. ఇందులో ఇరుదేశాలకు చెందిన కొంతమంది క్రీడాకారులు పాల్గొన్నారు. కరోనా కట్టడి గైడ్ లైన్స్ లో సెర్బియా కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఈ మ్యాచ్లకు దాదాపు 4 వేల మంది ప్రేక్షకులు కూడా హాజరయ్యారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. తొలి మ్యాచ్లో జొకోవిచ్, దిమిత్రోవ్ కలిసి డబుల్స్ ఆడారు. శనివారం జడార్‌‌ లో జరిగిన సెకండ్ లెగ్లో భాగంగా దిమిత్రోవ్.. బోర్నాకొరిచ్ తో తలపడి ఓడాడు.అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఈ ఇద్దరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. కలిసి ఫొటోలు దిగారు.సోషల్ డిస్టెన్స్ కూడా పాటించలేదు. ఈ మ్యాచ్ తర్వాత దిమిత్రోవ్ కు తీవ్ర జ్వరం రావడంతో.. టెస్ట్లు నిర్వహించారు. ఇందులో పాజిటివ్ అని తేలింది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా మంగళవారం నిర్వహించిన టెస్టుల్లో కొరిచ్‌కు కూడా వైరస్ సోకినట్లు తేలడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. ఇక, ఈ టోర్నీలో పాల్గొన్న దిమిత్రోవ్, కొరిచ్, అలెగ్జాండర్జ్ జ్వెరెవ్ తో కలిసి జొకో పార్టీ కూడా జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డొమినిక్ థీమ్ కూడా ఈ టోర్నీలో పార్టిసిర్టిపేట్ చేశాడు. ఈనెల 12 నుంచి వీళ్లందరూ కలిసే ఉన్నట్లు తెలుస్తోంది. టెన్నిస్‌ మ్యాచులు లేని టైమ్‌లో బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌ ఆడారు.

ఫైనల్ రద్దు ..
ఇద్దరు ప్లేయర్లు కరోనా బారిన పడటంతో.. ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ ను రద్దుచేశారు. ఈ మ్యాచ్ లో జొకోవిచ్ తో.. ఆండ్రీ రూబ్లెవ్ తలపడాల్సి ఉంది. ఓవరాల్ గా మ్యాచుల సందర్భంగా ఏ ప్లేయర్ కూడా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ను పాటించకపోవడంతోనే కరోనా బారినపడ్డారని తెలుస్తోంది. మాస్క్లు ధరించకపోవడం,సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం కూడా ముప్పుకు దారితీసినట్లు సమాచారం.ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన దిమిత్రోవ్.. ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరాడు. ముందు జాగ్రత్తగా తనతో కాంటాక్ట్ అయినవారు టెస్ట్లు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ‘ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. నాకు తెలియకుండా ఎవరికైనా హాని తలపెడితే క్షమించండి. ఇప్పటికైతే ఇంట్లోనే కోలుకుంటున్నా. ఆరోగ్యం నిలకడగా ఉంది.నాకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు’అని దిమిత్రోవ్ స్పష్టం చేశాడు.

లైన్‌ క్రాస్‌ చేయలేదు
నేను చేసింది తప్పు పని కాకపోయినా.. విమర్శలు వస్తాయని తెలుసు. ముఖ్యంగా వెస్ట్ (వెస్టర్న్ కంట్రీస్) నుంచి ఇవి ఎక్కువగా ఉంటాయి. ఫ్యాన్స్ ఎందుకు వచ్చారో తెలియదు. సోషల్ డిస్టెన్సింగ్ విషయంలోనూ తప్పిదాలు జరిగి ఉండొచ్చు. వీటన్నింటి గురించి వివరణ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే యూఎస్, గ్రేట్ బ్రిటన్లో ఉన్న పరిస్థితి సెర్బియా, దాని చుట్టు పక్కల కంట్రీస్ లో లేదు. తొలి రోజు నుంచే మేం గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ పాటించాం. మేం ఎక్కడా లైన్ను క్రాస్ చేయలేదు. అన్ని కార్యక్రమాలను బాగా నిర్వహించాం. అయినప్పటికీ కరోనా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు.
– జొకోవిచ్

For More News..

మేడిన్‌ ఇండియా పుంజుకుంటోంది