గృహలక్ష్మి అప్లికేషన్ రెడీ.. సిద్ధం చేసిన హౌసింగ్ ఆఫీసర్లు

గృహలక్ష్మి అప్లికేషన్ రెడీ.. సిద్ధం చేసిన హౌసింగ్ ఆఫీసర్లు
  • సిద్ధం చేసిన హౌసింగ్ ఆఫీసర్లు
  • ప్రభుత్వం ఓకే చేశాక జిల్లాలకు 
  • జిల్లాల్లో స్కీమ్​పై మొదలైన లొల్లి
  • యాప్, పోర్టల్ రెడీ చేసే పనిలో సీజీజీ

హైదరాబాద్, వెలుగు: సొంత జాగలో ఇంటి నిర్మాణం స్కీమ్​కు అప్లికేషన్  రెడీ అయింది. త్వరలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆమోదానికి హౌసింగ్ ఆఫీసర్లు పంపనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. మంత్రి ఓకే అనగానే అప్లికేషన్ ఫార్మాట్ ను పబ్లిక్ కు వెల్లడించనున్నారు. తర్వాత జిల్లాల్లో  కలెక్టర్లు, ఎమ్మెల్యేలు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఇక స్కీమ్ అమలుకు పోర్టల్​ను, యాప్​ను ఖరారు చేసే బాధ్యత సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ( సీజీజీ) కి ప్రభుత్వం అప్పగించింది. ఇంకో వారంలో ఇవి కూడా రెడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇవే వివరాలు

స్కీమ్​ను మహిళ పేరు మీదే ఇవ్వాలనిప్రభుత్వం నిర్ణయించటంతో మహిళ పేరు, గ్రామం, ఆధార్ నంబర్, ప్రత్యేకంగా ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్, బ్రాంచ్ ఇతర వివరాలు, గతంలో హౌసింగ్ స్కీమ్ లో ఇందిరమ్మ ఇల్లు లేదా డబుల్ ఇండ్లు పొందారా లేదా వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జాగా విస్తీర్ణం ఎంత, ఎక్కడ ఉంది...వంటి వివరాలు అప్లికేషన్ లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి

గృహలక్ష్మి స్కీమ్ పై ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది.  డబుల్ బెడ్రూమ్​ఇండ్లు స్లోగా నిర్మిస్తుండటం, మూడేండ్ల కింద పూర్తయిన ఇండ్లు ఇప్పటికీ పంపిణీ చేయకపోవటంతో ప్రభుత్వంపై పబ్లిక్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల సీఎం ఓపెన్ చేసిన కొల్లూరుతో పాటు ఇండ్లు పూర్తయిన చోట్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో లేట్ చేస్తే ఇంకా ప్రమాదం అని స్కీమ్​ను గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఆసిఫాబాద్ జిల్లాల్లో అప్లికేషన్లు తీసుకోవాలని కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చి ఆందోళన చేపట్టారు. గత వారం పబ్లిక్ నుంచి అప్లికేషన్లు తీసుకున్న అధికారులు ఈ వారం తీసుకోమని చెప్పటంపై ఆందోళన చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో మిగతా జిల్లాల్లో కూడా ఆందోళనలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి ఇంటిలిజెన్స్ చెప్పినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్, వెలుగు: సొంత జాగలో ఇంటి నిర్మాణం స్కీమ్​కు అప్లికేషన్  రెడీ అయింది. త్వరలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆమోదానికి హౌసింగ్ ఆఫీసర్లు పంపనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. మంత్రి ఓకే అనగానే అప్లికేషన్ ఫార్మాట్ ను పబ్లిక్ కు వెల్లడించనున్నారు. తర్వాత జిల్లాల్లో  కలెక్టర్లు, ఎమ్మెల్యేలు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఇక స్కీమ్ అమలుకు పోర్టల్​ను, యాప్​ను ఖరారు చేసే బాధ్యత సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ( సీజీజీ) కి ప్రభుత్వం అప్పగించింది. ఇంకో వారంలో ఇవి కూడా రెడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవే వివరాలు

స్కీమ్​ను మహిళ పేరు మీదే ఇవ్వాలనిప్రభుత్వం నిర్ణయించటంతో మహిళ పేరు, గ్రామం, ఆధార్ నంబర్, ప్రత్యేకంగా ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్, బ్రాంచ్ ఇతర వివరాలు, గతంలో హౌసింగ్ స్కీమ్ లో ఇందిరమ్మ ఇల్లు లేదా డబుల్ ఇండ్లు పొందారా లేదా వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జాగా విస్తీర్ణం ఎంత, ఎక్కడ ఉంది...వంటి వివరాలు అప్లికేషన్ లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి

గృహలక్ష్మి స్కీమ్ పై ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది.  డబుల్ బెడ్రూమ్​ఇండ్లు స్లోగా నిర్మిస్తుండటం, మూడేండ్ల కింద పూర్తయిన ఇండ్లు ఇప్పటికీ పంపిణీ చేయకపోవటంతో ప్రభుత్వంపై పబ్లిక్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల సీఎం ఓపెన్ చేసిన కొల్లూరుతో పాటు ఇండ్లు పూర్తయిన చోట్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో లేట్ చేస్తే ఇంకా ప్రమాదం అని స్కీమ్​ను గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. 

ఇప్పటికే ఆసిఫాబాద్ జిల్లాల్లో అప్లికేషన్లు తీసుకోవాలని కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చి ఆందోళన చేపట్టారు. గత వారం పబ్లిక్ నుంచి అప్లికేషన్లు తీసుకున్న అధికారులు ఈ వారం తీసుకోమని చెప్పటంపై ఆందోళన చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో మిగతా జిల్లాల్లో కూడా ఆందోళనలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి ఇంటిలిజెన్స్ చెప్పినట్లు తెలుస్తోంది.